సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గూడూరి ఉమాబాల గత శనివారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పట్టణంలోని 3 టౌన్ లో హౌసింగ్ బోర్డ్ కాలనీ, మారుతి నగర్, వేండ్ర కాలువ గట్టు వద్ద జరిగిన సమావేశాల్లో పాల్గొని ఓట్లను అభ్యర్ధించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అంటే గుళ్లో దేవుడు కాదని, కొంత మంది అధికారం రాగానే తామేదో దేవుడిగా భావిస్తారని.. ఈ పదవికి కేవలం బాధ్యతతో మాత్రమే పనిచేయాల్సి ఉందని, నాడు నేడు కూడా తాను అదే చేశానని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే పదవిని అలంకారంగా తీసుకోలేదని, కేవలం బాధ్యతగా తీసుకుని అనుక్షణం అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పనిచేశానని, దాని కారణంగానే ఈ 58 నెలల కాలంలో భీమవరం పట్టణం, వీరవాసరం, భీమవరం మండలాలతో పాటుగా భీమవరం పట్టణాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది అన్నారు. ఇందుకు నిదర్శనం 2004 నుండి 2009 వరకు, 2019 నుండి 2024 వరకు తాను చేసిన అభివృద్ధి పనులు ల్యాండ్ మార్క్ గా ప్రజలకు కనిపిస్తున్నాయని అన్నారు. అంతేగాని తాను ఏనాడు‌ వార్త పత్రికలను అడ్డు పెట్టుకోలేదని, ప్రజలకు మాటలు కాదు చేతలు లో పనిచేసి చూపించానని , ఈ ఎన్నికలలో తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమాబాల కు ఘన విజయంతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *