సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్, నటుడు పోసాని కృష్ణ నేడు, సోమవారం మీడియా సమావేశంలో ప్రఖ్యాత సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను హత్య చెయ్యడానికి భారీ కుట్ర జరిగిందని నారా లోకేష్ ఫై తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చంపటానికి టీడీపీ బ్యాచ్ ప్లాన్ వేసింది. ఒక టివి ఛానెల్ కు చెందిన అనిల్, నారా లోకేష్ అనుచరుడు రాజేష్ కిలారు ఆధ్వర్యంలో కుట్ర జరిగింది. లోకేష్ కూడా ఓకే అన్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు నో చెప్పడం తో హత్య జరగకుండా ఆగిపోయిం ది. ఆర్జీవీ హత్య కు జరిగిన కుట్రని రాజేష్ కిలారు మనుషులే నాకు చెప్పారు. దీనిపై పోలీసుల విచారణ జరగాలి. ప్రత్యర్ధిని ఓడించాలేగానీ, చంపాలనుకోవటం కరెక్టు కాదు. ఆఖరికి సీఎం జగన్ ను హత్య చేయించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడేమో? దయచేసి అధికారం కోసం అలంటి పని చెయ్యవద్దని చంద్రబాబు కు విజ్ఞప్తి చేస్తునన్నారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కి నలుగురు భార్యలు ఉన్నారు. 4వ భార్య పంజాబీ అమ్మాయి అని ఇండస్ట్రీ లో అందరికి తెలుసు అన్నారు. పవన్ కాపుల ఆత్మాభిమానం ను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాడు. చిరంజీవి కూడా గతంలో ఇదే పని చేసి ప్రజా రాజ్యం పార్టీ ని కాంగ్రెస్ కు అమ్మేశారని విమర్శించారు పోసాని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *