సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా అన్ని జిల్లాలలో కేసులు నమోదు అవుతున్నాయి.. తాజగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రెండు కరోనా కేసులు నేడు, ఆదివారం నమోదు కావడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. . ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడకు చెందిన ఓ యువకుడికి,(ఇతనికి 2 కిడ్నీలు పాడయి డయాలసిస్ పేషేంట్ గా ఉన్నారు) మరియు పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవిల్లి గ్రామానికి చెందిన బాలింతకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.. అయితే వేగివాడ కు చెందిన విజయవాడలో తనకు కోవిద్ నిర్ధారణ అయ్యాక ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన రిపోర్టు గత శనివారం సాయంత్రం ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయానికి రావడంతో డీఎంహెచ్‌వో డాక్టర్ శోభ పెదవేగి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్‌కు సమాచారం అందించి తక్షణ చర్యలకు ఆదేశించారు. ఆ గ్రామానికి వెళ్లిన డాక్టర్స్ బృందం వ్యాధిగ్రస్తుడి గుర్తించి తిరిగి ఏలూరు ప్రభు త్వాసుపత్రికి తరలించారు.
