సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యిసారి విడుదల అయిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకొంటే పశ్చిమ గోదావరి జిల్లా 23వ స్థానం సాధించడం గమనార్హం.. జిల్లా విభజన కు ముందు స్టేట్ ఫలితాలలో టాప్ 5లో పోటీ పడే పశ్చిమ ఉప్పుడు వెనుకబడింది. 26 జిల్లాలలో ఆఖరి 3 స్థానాలలో పోటీ పడుతుంది..పూర్వ వైభవం కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవలసి ఉంది. 2022–23 విద్యా సంవత్సరం టెన్త్ పరీక్ష ఫలితాలలో జిల్లా 64 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. ఈ ఏడాది 2023–24 ఉత్తీర్ణత 81.82 శాతంగా నిలిచింది. అంటే గత ఏడాదికంటే ఈ ఏడాది 17 శాతం పెరిగింది. ఈ ఏడాది జిల్లాలో ఫలితాలు గమనిస్తే బాలికలు . బాలురు 78.90 శాతం, బాలికలు 84.80 శాతం ఉత్తీర్ణతతో నిలిచారు. జిల్లా ఉత్తీర్ణత 81.82 శాతంగా నమోదైంది. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 20,785 మంది విద్యార్థులు హాజరు కాగా 17,007 మంది పాసయ్యారు. వీరిలో జడ్పీ హైస్కూల్స్‌లో 9,851 మంది పరీక్షలు రాయగా, 7,149 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు పాఠశాలల్లో 7,872 మందికి 7,611 మున్సిపల్ స్కూళ్లల్లో 1,805 మందికి 1,266 మంది ప్రభుత్వ పాఠశాలల్లో 435 మందికి 328 మంది, బీసీ వెల్ఫేర్ స్కూల్స్‌లో 201 మందికి 194 మంది, ఎయిడెడ్ పాఠశాలల్లో 333 మంది విద్యార్థులకు 187 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు రీ–కౌంటింగ్ మరియు రీ–వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజును చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ ఒక సబ్జెక్ట్‌కు రూ.500, రీ–వెరిఫికేషన్ ఒక సబ్జెక్ట్‌కు రూ.1000 చెల్లించాలి.
