సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్నేహితులతో క్లబ్ లు ఏర్పాటు చేసిన తోటివారికి ఆదర్శంగా నిలవడం గొప్ప విశేషమని, 30 ఇయర్స్ ఇండస్ట్రీ. . సినీ హాస్య నటులు పృథ్విరాజ్ అన్నారు. భీమవరం విచ్చేసిన పృథ్విరాజ్ ను మార్నింగ్ కాఫీ క్లబ్ కలిసి క్లబ్ డైరెక్టరీని అందించారు. క్లబ్ విది విధానాలను క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు వివరించారు. పృథ్విరాజ్ మాట్లాడుతూ మార్నింగ్ కాఫీ క్లబ్ చేస్తున్న సేవలు అద్వితీయమని, 3 ఏళ్లలో క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ క్లబ్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కారుమురి సత్యనారాయణ మూర్తి, భట్టిప్రోలు శ్రీనివాసరావు,తటవర్తి నారాయణ, మానేపల్లి వెంకన్నబాబు,తటవర్తి బదరి, చవ్వశ్రీనివాస్ సుబ్బారావు, కనగర్ల రామకృష్ణ, గాదె నాగేశ్వరావు, కురిశెట్టి నాని, గుండు సుధీర్, హిందూస్తాన్ సుబ్బారావు, సంకా బాబు, గుండు సుమూర్తి, అనంతపల్లి సుబ్బారావు,సకల కుమార్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *