సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో 1వ తారీకు రాగానే 95 శాతం పైగా పింఛన్ లు మొదటి రోజునే వాలంటీర్లు అందించేవారు. వారు విధులకు దూరంగా ఉండాలని ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. పింఛన్ లబ్దిదారులకు కొంత ఆలస్యం తప్పడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మే నెలకు సంబంధించి పింఛన్ల ప్రక్రియ లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ లకు అనుసంధానం చెయ్యడంతో .. సుమారు 2 ఏళ్లుగా అకౌంట్ లో లావాదేవీలు జరపని వారి అకౌంట్స్ లో ప్రభుత్వం నుండి డబ్బు పడినప్పటికీ బ్యాంకు నిబంధనలు ప్రకారం ఆధార్ లతో తిరిగి రెన్యూవల్ తతంగం ఉండటంతో వారి డబ్బు చెల్లించలేని పరిస్థితి. అటు ఎర్రటి ఎండలో 3 రోజులుగా ఎండలలో తిరుగుతున్నా వృద్దులు, వితంతువులు వికలాంగులు కు ఆపసోపాలు ఇబ్బందులు తో పాటు సంబధిత బ్యాంకు సిబ్బంది కి కూడా తీవ్ర పని వత్తిడి పడింది. దీనితో కొందరు బ్యాంకు ఉద్యోగులు అదనపు సమయం బ్యాంకు లోనే గడుపుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో కొందరికి బ్యాంక్ అకౌంట్లో నగదు జమచేయగా మరికొందరికి ఆయా సచివాలయా ల వద్దే ఇస్తున్నారు అన్న సమాచారం అందింది. జిల్లాలో 2.34 లక్షల మంది లబ్ధిదారులు వుండగా వారిలో 68 వేల మంది దివ్యాంగుల, అనారోగ్య బాధితులకు ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయం ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలో జమచేశారు. కొందరికి రెండు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. అలాంటి వారు ఒక బ్యాంకుకు వెళితే పడలేదని చెప్పారు. మరో ఖాతా ఉన్న పట్టణాలలో ఉన్న బ్యాంకుకు వెళ్లిన కూడా కొందరికి నిరాశ ఎదురవుతున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రభుత్వ సచివాలయాలలో సుమారు 4200 మంది కార్యదర్శులున్నారు. అయితే మరో 11 రోజులలో ఎన్నికల కు కావలసిన సరంజామా ఏర్పాట్ల లో బిజీ కావడంతో వారికీ పూర్తీ స్థాయిగా పింఛన్ ల పంపిణీలపై ద్రుష్టి సారించే పరిస్థితి కనపడటం లేదు. అందుకే ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వం ఆ దిశగా సచివాలయ ఉద్యోగులపై వత్తిడి తేలేకపోతుంది.
