సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు వేసవి క్రికెట్ కోచింగ్ క్యాంపు బాయ్స్ అండ్ గర్ల్స్ కు స్థానిక డి. ఎన్. ఆర్. కళాశాల (గన్న బత్తుల ఆటస్థలం ) వారి ఆధ్వరంలో నేడు, శుక్రవారం కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్, గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) ప్రారంభించారు. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా డి. ఎన్. ఆర్. కళాశాలలో వేసవి శిక్షణ శిబిరాలు క్రీడలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో క్రికెట్ అసోసియేషన్ వారు బాలలబాలికలకు క్రికెట్ శిభిరం ఏర్పాట్లు చేస్తున్నందుకు వారికి కృతఙ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు కావలసిన వసతులు మా గవర్నింగ్ బాడీ అనుమతితో ఏర్పాటు చేసాము. ఈ అవకాశాన్ని అందరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. కళాశాల ఉపాధ్యక్షులు జి. పాండు రంగరాజు మాట్లాడుతూ.. జిల్లా క్రికెట్ అసోసియేషన్ మరియు డి. ఎన్. ఆర్. కళాశాల అసోసియేషన్ MOU చేసుకుని పది సంవత్సరాల నుంచి ఈ ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నందుకు క్రికెట్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కె. రామకృష్ణంరాజు, కె. శివ రామరాజు , Dr. పి. వి. నరసింహరాజు , క్యాంపుకి కోచ్ గా నిర్వహిస్తున్న టి. శ్రీనివాస్, మహిళా విభాగానికి కోచ్ లుగా జిల్లా ప్రియాంక, రామదేవులు వ్యవహరిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
