సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శుక్రవారం నర్సాపురంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ తో పాటు లోక్ సభ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాదరాజు పాల్గొన్నారు. ఈ సందర్భముగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధి జరిగిన సుమారు 2న్నర లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యొగాలు వచ్చిన, ప్రజలకు నవరత్నాలు వచ్చిన, రాష్ట్రంలో విద్య, వైద్య వ్యవస్థలు ఆధునీకరణ తో పాటు పేదలకు అందుబాటులోకి వచ్చిన అది మీ బిడ్డ జగన్ పాలనలోనే అన్నది అందరు గమనించాలని అన్నారు. మన పాలనపై, వాలంటీర్లు ఫై కక్ష్య తో చంద్రబాబు చేయించిన ఫిర్యాదుతో గత 2 నెలలుగా అవ్వ తాతలు ఇంతటి ఎండలలో పింఛన్ లకోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గూడూరి ఉమాబాల మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిసి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత వైయస్ జగన్ కు దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు బిసిలను పట్టించుకో లేదని, వైఎస్ఆర్సిపి ఆవిర్భ వించాకే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దక్కిందని , ఇటువంటి ప్రాధాన్యత కల్పించిన వై ఎస్ జగన్ కు అండగా నిలవాలని ఆమె కోరారు. మద్య తరగతి బిసి కుటుంబానికి చెందిన తనను పార్లమెంటు అభ్యర్థినిగా ఎంపిక చేయడం ఆనందంగా వుందన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు పై వేసి జగనన్న ను మళ్ళీ ముఖ్య మంత్రి చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *