సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల నేటి శనివారం ప్రభుత్వ విప్ మరియు భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ తో కలసి భీమవరం టౌన్ లోని 6,7,8,9 మరియు 10వ వార్డులలో జరిగిన ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు వేసి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా గ్రంధి శ్రీనివాస్ ని గెలిపించాలని కోరారు. గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు సీఎం జగన్ మాత్రమే నని, ఆయన పాలనను బలపరుస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ప్రజలందరి మద్దతు తెలపాలని, 2ఏళ్ళు కొనసాగిన కరోనా సమయంలో సీఎం జగన్ ప్రజలను వైద్యపరంగాను ,ఉచితంగా మందులు, డబ్బులు, ఆహారం వాలంటీర్లు సహాయంతో పంపిణి చేసి ప్రజలను ప్రాణాలు కాపాడిన తీరును, కష్టాలలో ఉన్న కుటుంబాలకు పెంక్షన్లు పంపిణి చేసి ఆదుకున్నారు అని అన్నారు.. మరి చంద్రబాబు , పవన్ కళ్యాణ్, లోకేష్ లు హైదరాబాద్ వదిలి రాలేదని, తనపై పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి అంజిబాబు కరోనా సమయంలో భీమవరంలో ఎవరికైనా సాయం చేసారా? కనీసం ఎవరికైనా కనిపించి పరామర్శించారా ? ప్రజలు, యువకులు మహిళలు వాస్తవాలు గమనించి, రాజకీయ పార్టీలకు అతీతంగా ఓట్లు వెయ్యాలని గ్రంధి శ్రీనివాస్ కోరారు. . ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు,
