సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోనే తొలిసారిగా ఎన్నికల సంఘం వృద్ధులు, నడవలేని 40 శాతంకన్నా ఎక్కువ వికలాంగత్వం వున్న వికలాంగులకు తమ ఇళ్ల వద్దే ఓటు వేసే అవకాశాన్ని కల్పించడంతో ఈ తరహా ఓటర్లు తమ ఓటు హక్కును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వినియోగించుకొంటున్నారు. పోలింగ్‌ అధికారి, సహాయ పోలింగ్‌ అధికారి, వీడియో గ్రాఫర్‌, ఆర్డ్మ్డ్‌ కానిస్టేబుల్‌ సమక్షంలో వీటిని నిర్వహించారు. ప్రత్యేక పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఓటును వేయించి సీల్డ్‌ కవర్‌లో అధికారుల సమక్షంలోనే స్టీల్‌ డ్రమ్ములో భద్ర పరుస్తున్నారు. ఏలూరు జిల్లాలోనిన్న శుక్రవారం తొలిరోజు హోం ఓటింగ్‌ విజయవంతంగా జరిగింది. జిల్లాలో మొత్తం 914 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో తొలి రోజు శుక్రవారం 579 మంది తమ ఇళ్ల వద్దే ఓట్లు వేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 1,119 మందికిగాను, తొలిరోజు 213 మంది వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రకటించారు. . ఆచంట లో 86 మంది, పాలకొల్లు 329, నరసాపురం 112, భీమవరం 109, ఉండి 151, తణుకు 181, తాడేపల్లిగూడెంలో 151 మంది ఉన్నారు. మొదటి విడతగా నిన్నటి శుక్రవారం మూడో తేదీ నుంచి ఐదు వరకు, రెండో విడత ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. వృద్దులు వికలాంగులు నూటికి నూరుశాతం ఓటుహక్కు వినియోగించుకొంటారని ఆశాభావం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *