సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి లో రేపటి సోమవారం కూటమి పార్టీల ‘ విజయ శంఖా రావం’ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నారు. ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ హాజరవుతారు. ఈ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, తూర్పుగోదావరి ఎస్పీ జగదీశ్‌ భద్రతా ఏర్పాట్లను చూస్తున్నారు. నలుగురు అడిషనల్‌ ఎస్పీలు, 8 మంది డీఎస్పీ లతోసహా మొత్తం 2,347 మంది పోలీస్‌ సిబ్బందిని ప్రధాని బందోబస్తుకు విని యోగిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. రేపు 6వ తేదీన ఉదయం 6గంటల నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి వస్తాయన్నారు. గోదావకి జిల్లాల పరిధిలో దాదాపు లక్ష జనాభా తరలి వస్తారని అంచనా. రేపు ప్రధాని మోదీ చత్తీస్‌గఢ్‌ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం మధ్యా హ్నం 2.55 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకుంటారు. 3.30 గంటలకు సభావేదిక మీదకు వస్తారు. 4.30 గంటలకు ఆయన ప్రసంగం ముగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *