సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముస్లింల రిజర్వేషన్లపై బీజేపీకి ఉన్న పాలసీకి.. టీడీపీ జనసేన మద్దతు పలుకుతున్నారని తొలిసారి సీఎం జగన్ బిగ్గరగా ఆరోపించారు. నెల్లూరు బహిరంగ సభలో నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముస్లిం మైనార్టీ నాయకుడు ఖలీల్ అహ్మ ద్‌ను ప్రజలు గెలిపించాలని కోరుతూ ..అన్నదమ్ములుగా కలసియున్న ప్రజలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు సమంజసం కాదని,ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను మతం ప్రాతిపదికన ఇచ్చినవి కాదని జగన్ స్పష్టం చేశారు. ముస్లింలలో కూడా ధనికులయిన వర్గాలకు రిజర్వేషన్ వర్తించడం లేదన్నారు. ఇలాంటి రిజర్వేషన్లపై రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడడం ధర్మమేనా? సరైందేనా? అని బీజేపీని ఆయన ప్రశ్నించారు. ప్రతి మైనార్టీ సోదరుడికి, అక్క చెల్లెమ్మ లకు చెబుతున్నా … నాలుగు శాతం రిజర్వే షన్ విషయమే కానివ్వండి, ఎన్ఆర్సీ,సీఏఏ, ఇంకా ఏ మైనార్టీ అంశమైనా వారికి వైసీపీ పార్టీ అండగా నిలుస్తుందని జగన్ భరోసా ఇచ్చా రు. అందుకే రాష్ట్రంలో 175 అసెంబ్లీస్థానాల్లో 7 సీట్లను ముస్లిం మైనార్టీలకు ఇచ్చానన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు ఆలోచనలో ఉన్న బీజేపీతో చంద్రబాబు జత కట్టాడని మండిపడ్డారు. మళ్లీ ముస్లింల ఓట్ల కోసం చంద్రబాబు ఊసరవెల్లిలా డ్రామాలు ఆడుతున్నాడని మైనారిటీలు గుర్తించి వారికీ తగిన బుద్ది చెప్పాలన్నారు.
