సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్టులు కూడా కొనసాగుతున్నాయి. ఈ వేసవిలో ఇకపై మరింత వేడిమితో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఎండ వేడిమికి ఉదయం 8 గంటల నుండే తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలలో పలు జిల్లాల్లో 42 నుండి 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. అంతేకాదు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. మరో 3,4 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ వైఖరిని చంద్రబాబు సమర్థిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *