సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఫై టీడీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని పిర్యాదులు రావడంతో ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ చేపట్టిం ది. ఈ కేసులో నేడు, ఆదివారం చంద్రబాబు ఏ1గా, లోకేష్ఏ 2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పైక్ట్ , ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ లో ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది అని వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దానికి తగిన ఆధారాలు ను ఆడియో కాల్స్ ను ఈసి కి సమర్పించారు, . విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. ఈ దుష్ప్రచారం వెనుక ఎవరు ఉన్నారు అన్న విషయం ఫై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరక్టోల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్ తో పాటు మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది. వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే..‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తూరికార్డ్ మెసేజ్లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
