సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో 4,5,8,9,10 వార్డులలో జనసేన ఎమెల్య అభ్యర్థిగా పోటీచేస్తున్న పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ తో కలసి ఇంటింటా ప్రజలను కలుస్తూ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ కి సైకిల్ గుర్తుపై , లోక్ సభ బ్యాలెట్ లో కమలం గుర్తుపై ఓటు వేసి ఇరువురిని గెలిపించాలని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే అటు కేంద్రం ఇటు రాష్ట్రము ఇక్కడ భీమవరం అభివృద్ధి పధంలో పయనిస్తాయని వారి ప్రచారంలో పేర్కొన్నారు. గత రాత్రి మత్య పూరి గ్రామంలో అంజిబాబు తన ప్రచారం వ్యాను ఫై నుండి ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ.. అక్కడ సీఎం జగన్ అరాచక పాలన ఇక్కడ భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాలన లు ముగింపు దశకు వచ్చేశాయని, ఇద్దరు ఓటమి చెందటం ఖాయం అన్నారు. భీమవరం నియోజకవర్గంలో గ్రంధి శ్రీను ఆయన మనుషులు చేసే అరాచకాలు , రౌడీ ఇజాలను ఇక్కడ మత్యపురి ప్రజలు స్వయంగా చూసారని , గతంలో మత్యపురిలో రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగితే.. ఎమ్మెల్యే వెంటనే .. పోలీసులను గొడవలు జరగకుండా ఆదేశించాలి కానీ.. ఏకంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కఱ్ఱపట్టుకొని తన మనుషులతో స్పాట్ కు వచ్చేయడమేమిటి? జనసేన పార్టీ వారిపై దాడి చెయ్యడం ఏమిటి? ఇక్కడి వారిపై 30 కి పైగా పోలీస్ కేసులు పెట్టించారని విమర్శించారు, ఈ ఎన్నికలలో మత్యపురి, భీమవరం మండలం ప్రజలు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అంజిబాబు ను గెలిపించి వైసీపీ వాళ్ళను సాగనంపాలని అంజిబాబు అన్నారు.
