సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని ఉండి నియోజకవర్గ ఎమెల్య , తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు కార్యాలయంలో నేడు, ఆదివారం జరిగిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి , రఘురామా కృష్ణంరాజు పాల్గొని ఉండి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మీ అందరి సహకారం కోరుతున్నానని అన్నారు. తాను ప్రస్తుత ఎంపీ గా తన పార్లమెంటరీ పరిధిలో ఉన్న ఉండి నియోజకవర్గం అభివృద్ధికి ఏంతో కృషి చేసానని కేంద్రం నుండి తన ఎంపీ నిధులు మంజూరు చేయించానని వాటిలో కీలకమైనవి. ఉండి మండలానికి కేటాయించిన మొత్తం 1,కోటి 83 లక్షల 50వేల రూపాయల తన ఎంపీ నిధులలో 1,56,50,000 డ్రైనేజి, సీసీ రోడ్లు మరియు కల్వర్టు స్లాబ్స్ కోసం వినియోగించగా. ఇంకో 27,లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి అన్నారు. ఆకీవీడు మండలానికి కేటాయించిన 1,కోటి 49,లక్షల నిధులు కేటాయించగా అందులో రూ.1,06,00,000 నిధులను డ్రైనేజి, సీసీ రోడ్లు మరియు కల్వర్టు స్లాబ్స్ నిర్మాణానికి వినియోగించగా, ఇంకో . 43,లక్షల నిధులతో పనులు జరుగుతున్నాయి అన్నారు. కాళ్ళ మండలానికి కేటాయించిన మొత్తం 2 కోట్ల 48,లక్షలు నిధులు మంజూరు చెయ్యగా రూ. 1,70,00,000 తో డ్రైనేజి మరియు సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం. మంచి నీటి ట్యాంక్ నిర్మాణం చేయించడం జరిగింది. ఇంకో 5.78,00,000 పనులు జరుగుతున్నాయి అన్నారు. ఇక పాలకోడేరు మండలానికి కేటాయించిన మొత్తం నిధులు రూ. 53,00,000 అందులో రూ. 45,00,000 ల నిధులతో డ్రైనేజి, సీసీ రోడ్లు, పశువులకు ర్యాంపులు, ఇతర అభివృద్ధి పనుల కోసం వినియోగించారు. ఇంకో రూ.8,లక్షల రూపాయల నిధులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి అని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు కనకరాజు సూరి, జుత్తుగ నాగరాజు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు, ఆదివారం, రఘురామకృష్ణ రాజు సతీమణి రమాదేవి ఆకివీడు మండలంలో చెరుకుమిల్లి గ్రామంలో అలాగే ఆయన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని ఉండి మండలంలో కలిసిపూడి, ఉండి – గోరుంతోటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *