సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక డిఎన్నార్ కళాశాల మెయిన్ రోడ్డు వద్ద డిఎన్నార్ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చలి వేంద్రం ఎర్రటి ఎండలో ఎందరో బాటసారుల దాహార్తిని తీరుస్తుంది. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడంకోసం పట్టణంలో , ప్రతి చోటా చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం మంచిదని, చలి వేంద్రాల ఏర్పాటులో మా సహకరం ఉంటుందని మా మార్నింగ్ కాఫీ క్లబ్ సహకారంతో రెండురోజుల పాటు సహకరిస్తున్నారని నిర్వాహకులు అన్నారు. అందరూ ఇటువంటి మంచి కార్యక్రమాలకు ముందు రావాలని వారు పిలుపునిచ్చారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లా రావు, కార్యదర్శి పి.సీతారామరాజు మాట్లాడుతూ దాతలందిస్తున్న సహకారం అద్వితీయమని, నెలరోజులపాటు ఈ ప్రాంతంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో కారుమురి సత్యనారాయణ మూర్తి,కనగర్ల రామకృష్ణ, గాదె నాగేశ్వరావు, గుండు సుమూర్తి, అనంతపల్లి సుబ్బారావు, కురిశెట్టి శ్రీనివాస అప్పారావు, బొండా హనుమంతరావు, వబిలిశెట్టి వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *