సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను రాజకీయ పార్టీలకు అతీతంగా తాను చేసిన అభివృద్ధి , అందించిన ప్రభుత్వ సంక్షేమాలను వివరిస్తూ గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. నేటి , ఆదివారం నుండి భీమవరం మండలంలో మరో విడుత తన ప్రచారం ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల కూడా ఆయనతో కలసి ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుకే ఓట్లు వెయ్యాలన్నారు. వెంప పరిసరాలలో విశేష సంఖ్యలో ఆయన అభిమానులు వైసీపీ శ్రేణులతో కలసి ప్రచారం నిర్వహించారు. జనం కోసం జనంలో ఒకడిగా బ్రతికే ‘జగన్’ లాంటి నాయకుడిని ఎన్నుకొంటే మంచిదని, కేవలం అధికారం కోసం ఎన్నికల అప్పుడు మాత్రమే కనపడి.. ప్రజలకు దొంగ హామీలు ఇస్తూ తరువాత ప్రజలకు దూరంగా ఉండే ‘మేకవన్నె తోడేళ్ళు‘ లాంటి నేతలను’ రాష్ట్రంలోనూ, ఇక్కడ భీమవరంలోను ప్రజలు దూరంగా పెట్టాలని అన్నారు. రేపు సోమవారం ఉదయం నుండి తాడేరు, బేతపూడి, తుందురు, జొన్నల గురువు లలో ప్రచారం చెయ్యనున్నారు. ఈ గ్రామాలలో జనసేన పార్టీకి మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే.. అక్కడ కూడా ఈసారి వైసీపీ భారీ మెజారిటీ సాధించాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక యువతతో మమేకమై ప్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.
