సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శివారులోని తన నివాసంలో ఎంపీ రఘురామా కృష్ణంరాజు రచ్చబండ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా తనకు తన కుటుంబ సభ్యులకు ప్రచారంలో వాడవాడలా ప్రజలు అనూహ్యంగా మద్దతు పలుకుతున్నారని, ఎందరు కుట్రలు పన్నిన తన గెలుపు ఎవరు ఆపలేరన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని సర్వే లు అన్ని చెబుతున్నాయని, ఒక్క టైమ్స్ నౌ సర్వే ను మినహాయించాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. నేను కూడా స్వయంగా రెండు సర్వేలను చేయించాను. ఏ సర్వే అంచనాలను చూసిన కూటమి విజయాన్ని సూచిస్తున్నాయన్నారు. ఉభయగోదావరి జిల్లాలలో కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని తెలిపారు . వైసిపి కి మూడు నుంచి నాలుగు స్థానాలు వస్తాయని చెబుతున్నప్పటికీ, ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదన్నారు. నేటి రాజమండ్రిలో ప్రధాని మోడీ సభ విజయవంతం అవుతుందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించిన అమరావతి రాజధానిని పునర్నిర్మిస్తామని, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధర్మవరం సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కూటమి నుంచి నేను ఆశించింది ఇదేనని, ఈ ఆశయం కోసమే కూటమిలో బిజెపి ఉండాలని కోరుకొన్నానన్నారు.ఎంపీ రఘురామకృష్ణంరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *