సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు అంతే వేగంగా తిరిగి పెరుతున్నాయి. తాజా గా ధరల పరిస్థితి గమనిస్తే.. విజయవాడ, హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే మే 6 సోమవారం ధరతో పోలిస్తే.. నేటి మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు ఒక రూపాయి ధర పెరిగింది. గ్రాము బంగారం ధర రూ.6,606గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.66,060గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,206గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.72,060గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి
