సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యాలోని మాస్కోలో తాజగా జరిగిన వాల్దాయ్ ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రష్యా ఎక్స్‌పర్ట్స్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ఆపేందుకు భారత్ మోడీ సమర్థుడని ప్రశంసల జల్లు కురిపించారు. ఉక్రెయిన్‌తో తాము చేస్తున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయని పుతిన్ అన్నారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగింపు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం ఆయన తీసుకుంటున్న చొరవ అభినందనీయం. భారత్‌తో రష్యాకు మంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. అలాగే, మోదీతోనూ నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని అదేపనిగా కోరుతున్న పలు దేశాల అధినేతల్లో మోదీ కూడా ఒకరు’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మోదీ తటస్థ వైఖరి తీసుకున్నప్పటికీ యుద్ధం ముగింపువైపే ఆయన మొగ్గు చూపుతున్నారని పుతిన్ తెలిపారు. ఆ విషయాన్ని చెప్పడం తన విధి అని పేర్కొన్నారు. యుద్ధం ముగించడానికి మోదీ ఇచ్చిన సూచనలు, ఆలోచనలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ యుద్ధం ఆపడానికి ఎంతో కృషి చేసానని అయిన యుద్ధం ఆగలేదని ట్రంప్ తన ఘనత తానే చాటుకొంటుండంగా పుతిన్ ఆ ఘనత ప్రధాని మోడీకి కట్టబెట్టడం గమనార్హం,
