సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. మరి జూన్ 27న రిలీజ్ కాబోతున్నఈ మూవీ కోసం ప్రపంచ సీనీప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనాలను క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. నాగ్ అశ్విన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ స్థాయిలో 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపఠాని లాంటి స్టార్స్ను ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ దేవరకొండ నాని, దుల్కర్ సల్మాన్ లు అతిధి పాత్రలలో మెరవనున్నారు అని తెలుస్తుంది. తాజాగా ఈ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ ను రంగంలోకి దించబోతున్నాడట నాగ్ అశ్విన్.
