సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల పోలింగ్ కు ఇక గడువు మరో 4 రోజులు మాత్రమే ఉంది..అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. వైసీపీ అభ్యర్థిగా విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మన సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ.. దాదాపు నియోజకవర్గంలో నా ప్రచారం పూర్తీ చేసుకొంటున్నానని పట్టణంలో పూర్తీ అయ్యిందని అన్నారు. ఇంకా వీరవాసరం , భీమవరం మండలాల్లో కొన్ని గ్రామాలలో మాత్రమే మిగిలాయని అక్కడ ఇంటింటా పర్యటన పూర్తీ చేస్తానని అన్నారు. ప్రజా స్వాందన మాములుగా లేదని, ముఖ్యంగా గృహిణులు తమ సోదరుడిగా కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆహ్వానించారని అక్కడే ఎంతటి ఘన విజయం సాదించబోతున్నానో అర్ధం అయ్యిందని అన్నారు. సీఎం జగన్ సంక్షేమం దాదాపు ప్రతి గృహాన్ని, కుటుంబాన్ని తాకిందని , చంద్రబాబు పవన్,ల దొంగ హామీలు ప్రజలు నమ్మే దిశలో లేకపోవడంతో ఉక్రోషంతో దొంగ సర్వేల పేరుతొ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని.. ఏది ఏమైనా అంజిబాబు కు భీమవరంలో దారుణ పరాజయం తప్పదని అన్నారు. గత ఎన్నికలలో ఓడిపోయాక 4న్నర ఏళ్ళు ప్రజలకు, టీడీపీ పార్టీ, జనసేన క్యాడర్ కు కనపడకుండా, వాళ్ళ కర్మకు వదిలేసిన వ్యక్తి..అంజిబాబు, ఇపుడు అధికారం కోసం వస్తే ఎలా ఆహ్వానిస్తాం? .. ఈ మాటలు తనవి కాదని,సాక్షాత్తు టీడీపీ జిల్లా అడ్జక్షురాలు తోట సీతారామ లక్ష్మి గారు గతంలో పబ్లిక్ గా అన్నారని గుర్తు చేసారు. కరోనా సమయం లో టీడీపీ క్యాడర్ ను కూడా తానే ఆదుకొని ఆసుపత్రిలో చేర్చానని అప్పుడు అంజిబాబు వచ్చాడా? అని ప్రశ్నించారు. అంజిబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిందేమిటి? 2004 లో నా హయాంలో అభివృద్ధి చేసినవే మూయించాడని, పట్టణంలో 2 టౌన్ బస్సు స్టాండ్ వారి అనుచరులు ఆక్రమించారని, వీరమ్మ పార్క్ పనికిరాకుండా చేసారని, మల్టి ఫెక్స్ థియేటర్స్ ముందు ఉండి రోడ్డు ఆక్రమించారని మోటారు సైకిల్ పార్కింగ్ పెట్టి ప్రజలు నుండి, 10 ఏళ్లుగా కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని, నా హయంలో 2 టౌన్ బస్సు స్టాండ్ పునః ప్రారంభించానని, వీరమ్మ పార్క్ ను బివి రాజు .. వారి సహకారంతో హై క్లాస్ పార్క్ గా సుందరీకరించానని ప్రజలకు ఆహ్లాదంగా ఉచితం ప్రవేశం, యువతకు ఉచిత జిమ్ ఏర్పాటు చేయించానని,మోటారు సైకిల్ పార్కింగ్ ను మరల ఉచితంగా చేయించానని, అంజిబాబు అరాచకాలు ప్రజల కోసం అడ్డుకొన్నందుకు కక్షతో తనను అల్లరి చేసే కార్యక్రమం అంజిబాబు మొదలు పెట్టాడని ప్రజలుగమనిస్తున్నారని అన్నారు. ఈసారి ఎన్నికలలో తనకు మా వైసీపీ క్యాడర్ తో పాటు,ఓసీలు, బీసీలు , ముస్లీమ్ మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజల తో పాటు నిజాయితీ పరులయిన మనస్సాక్షితో పనిచేసే టీడీపీ జనసేన క్యాడర్ అండ కూడా తనకు ఉందని జిల్లాలోనే అత్యధిక మెజారిటీ తో వైసీపీ గెలిచే సీటు.. భీమవరం అవుతుందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *