సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయగా.. మిగిలిన 65 మందికి నేటి, గురువారం సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, పలువు కేంద్రమంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. దేశంలో 2వ అత్యున్నత పునస్కారం సాధించిన తెలుగు వాడుగా చిరంజీవి కి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రముఖులు శుభాభినందనలు తెలుపుతున్నారు.
