సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ లకు జరుగుతున్నా ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ జరుగనుండడంతో రేపటి శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను గుర్తించి షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. మార్చి 16న పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 18వ తేదీన నోటిఫికేషన్‌ ప్రకటించగా.. 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. పోలింగ్ సమయం కూడా గతంలో కన్నా ఒక గంట అదనంగా పొడిగించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఈనెల 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అన్ని ప్రాంతాల్లో ప్రధాన పార్టీల క్యాడర్ ఓటర్లు కు స్లిప్స్ తో పాటు ఇతర ” పంపిణి’ ల కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఉండి నియోజకవర్గంలో ఈసారి ఉండి లో త్రిముఖ పోటీ జరుగుతుండగా అక్కడి ఓటర్లకు త్రిబుల్ ధమాకా అందుతున్నట్లు సమాచారం. జిల్లాలో 2న్నర లక్షల పైగా ఓటర్లు ఉన్న అతి పేద్ద నియోజకవరం భీమవరం లో ప్రధాన అభ్యర్థులు ఇరువురు ఇంకా అతి తూచి అడుగులు వెయ్యబోతున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *