సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 4 రోజులుగా నష్టాలలో ఉగిసలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు, శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత గురువారం భారీ నష్టాలతో ముగిసిన సూచీలు నేడు అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో కోలుకున్నాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 247 పాయింట్లు లాభపడి.. 72652 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 87 పాయింట్ల లాభం తో 22045 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి విదేశీ మారకం విలువ 83.50 వద్ద నిలకడగా ఉంది. నిఫ్టీలో బీపీసీఎల్, ఐటీసీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉండగా ..ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైండ్ టీ, లార్సన్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
