సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం ఉదయం భీమవరం ఒకటో మరియు రెండవ టౌన్ లో జరిగిన పలు వాకర్స్ అసోసియేషన్ ల ఆత్మీయ సమావేశాలలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి గూడూరి ఉమాబాల మరియు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ గారి తనయుడు గ్రంధి రవితేజ తో పాల్గొన్నారు. 13న జరగబోయే ఎన్నికలలో ఎంపీగా తనని ఎమ్మెల్యేగా గ్రంధి శ్రీనివాస్ గారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరి జగదీష్ కుమార్ , తోట భోగయ్య, వడపు గోపి గారు, ఆర్.వి ప్రసాద్ , అసోసియేషన్ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. తదుపరి నరసాపురంలో బార్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో గూడూరి ఉమాబాల మరియు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలు మనందరికీ ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, మేధావులు , లాయర్లు తో కూడిన అసోసియేషన్ సహకారం తమపై ఉండాలని, విద్య, వైద్య రంగాలలో జగన్ దేశానికీ ఆదర్శంగా నిలిచాడని ఆయన పాలనకు మద్దతు ఇవ్వలని అభ్యర్ధించారు. తమను గెలిపిస్తే నరసాపురం పార్లమెంట్ అభివృద్ధికి నేను, నరసాపురం నియోజకవర్గం అభివృద్ధికి ముదునూరి ప్రసాద్ రాజు మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ పెద్దలు, సభ్యులు, పాల్గొన్నారు.
