సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 2 రోజులలో ఎన్నికల నేపథ్యంలో భీమవరం నియోజకవర్గం లో దాదాపు అన్ని గ్రామాలలో ప్రచారం పూర్తీ చేస్తున్న గ్రంధి శ్రీనివాస్ కు భీమవరం మండలం లో ప్రజలు అభిమానులు అన్ని ప్రాంతాలలో మంచి స్వాందన కనిపిస్తుంది. తాజగా మత్స్యపురి గ్రామంలో అయితే మహిళలు వాడవాడలా మలుపు మలుపుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఆయనకు పుష్పాలు విసురుతూ హారతులు ఇచ్చారు.. ఆయనతో వారు మాట్లాడుతూ, బహిరంగంగా మా ఓటు మీకే అంటూ హర్షం వ్యక్తం చేసారు. స్థానిక యువత బైక్ లపై వైసీపీ జెండాలు ఊపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భముగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్ ప్రజా సంక్షేమ పధకాల లబ్ది ని ఎవరు అడ్డుకోలేరని..ఇది జగన్నన్న పథకాలకు , నా హయాంలో జరిగిన అభివృద్ధికి ప్రజల నుండి ముఖ్యంగా యువత, మహిళలు నుండి వస్తున్నా గౌరవం, హర్షం మాములుగా లేదని , తన గెలుపు ను అడ్డుకోవడానికి కలుగులో ఎలుకలు లాగా, నక్క తెలివితేటలుతో ఎన్ని కుట్రలు చేసిన మరో 3 రోజులలో ప్రజలు తమ పవిత్ర మైన ఓట్లతో నాకు మద్దతు ఇచ్చి నిజం నిగ్గు తెలుస్తారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు, పవన్ , మోడీలు మాత్రమే కాదు దేశంలో అన్ని పార్టీలు ఏకమై వచ్చిన, ప్రజలు మిచ్చిన హీరో జగన్ భారీ విజయం తో సీఎంగా జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చెయ్యడం ఖాయం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *