సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం రాయలం మరియు, చినమీరం గ్రామాలలో నేటి శుక్రవారం సాయంత్రం కూటమి బలపరుస్తున్న జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ప్రచారం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన , టీడీపీ కార్యకర్తలు ముఖ్యంగా యువత ఉత్సహంగా పాల్గొన్నారు. రాయలం గ్రామం ప్రారంభంలో ఉన్న శ్రీరామాలయం లో ప్రత్యేక పూజలు చేసి అంజిబాబు జనసేన భీమవరం నియోజక వర్గ ఇంచార్జి చంద్రశేఖర్ తో కలసి ప్రచారం ప్రారంభించారు. చిన్నమిరంలో తెలుగుదేశం జెండాలు చేత బూని మహిళా కార్యకర్తలు విశేషంగా ఆయన పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భముగా అంజిబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకొంటున్నారని అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ ఉద్జోగుల బ్యాలెట్ ఓట్ల లో నాకే మెజారిటీ వచ్చిందని భావిస్తున్నానని.. భీమవరం నియోజవర్గంలో ప్రజలు తనను ఎమ్మెల్యే గా కోరుకొంటున్నారని .. ఎటువంటి ప్రలోభాలకు లొంగక ప్రజలు గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వెయ్యాలని పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *