సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి శనివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తో అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుబడ్డాయి. ఘటనా స్థలం స్థ లో పోలీసులు పరిశీలనలో భారీగా తరలిస్తున్న నగదు గుట్టు బయటపడింది. వివరాలు.. నల్లజల్లర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి రాజమండ్రి కి పశువుల మేత తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళ్తోన్న వ్యాన్ను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా, డ్రైవర్ , క్లినర్ కు గాయాలయ్యయి. వారిని ఆసుపత్రి కి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ లోగ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాస్థ నికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యా న్ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్స్ లు అమర్చడాన్ని పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్స్ లను కోటి రూపాయలు చప్పున సుమారు 7 కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపి వాటిని మీడియాకు ప్రదర్శించారు. ఫై ఫొటోలో చూడవచ్చు.. వాటిని ఎన్నికల నేపథ్యంలో ఏ అభ్యర్థి తరలిస్తున్నాడో, లేక ఏ కారణంతో తరలిస్తున్నారో దర్యాప్తు లో తెలియవలసి ఉంది. వాటిని ప్రస్తుతం సీజ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *