సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లు అర్జున్ అంటే పవన్ అభిమానులు కాస్త దూరంగా పెడతారు. అది ఎందుకో అందరికి తెలిసిందే.. అయితే ఇటీవల జనసేనాని పవన్ కు తన శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్ ఇంతలోనే తాజాగా జనసేన కు పెద్ద షాక్ ఇచ్చారు. తాజాగా నేడు, శనివారం నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కి మద్దతు గా అల్లు అర్జున్ స్వయంగా నంద్యాల వచ్చి భారీ కాన్వాయ్ గా ఊరేగింపుగా వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి ఆ భవనం మీద నుండి ఆయనతో చేతులు పైకి ఎట్టి సంఘిభావము ప్రకటించడం తో అక్కడ చేరుకొన్న వైసీపీ అభిమానులు లో జోష్ రెండింతలు అయ్యి కేరింతలు కొట్టారు, అల్లు అర్జున్ పర్యటన నంద్యాల లో మంచి ఊపు తెచ్చింది. ఈ సందర్భముగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తనకు రాజకీయాలు రావని, అయితే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని అందుకే స్వయంగా వచ్చానని .. ‘రవి పాలిటిక్స్ లోకి రాకముందు వారానికోసారి కలిసే వాళ్లం కానీ ఐదేళ్లుగా ఆరు నెలలకోసారే కలుస్తున్నాం. ఇక్కడే తెలుస్తోంది కదా అతను ఎంత కష్టపడుతున్నాడో,ఎంత అభివృద్ధి చేసాడో తెలుస్తునని ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి ఇక్కడకు వచ్చా, ఆయన భారీ మెజారిటీ తో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇక నా స్నేహితులు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా వాళ్ళ కోసం వెళ్తానని ఆయన అన్నారు. అయితే మెగా కుటుంబం అంతా ఆఖరికి రామ్ చరణ్ తో సహా పిఠాపురం వెళ్ళితే అల్లు వైసీపీ అభ్యర్థి వైపు రూటు మార్చమేమిటి? మరి చిన్న మామయ్య పవన్ కోసం అల్లు ఏమి చెయ్యడా ?చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *