సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొద్దీ గంటలలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. తొలిసారి నరసాపురం ఎంపీ సీటుకు బిసి అభ్యర్థిని పైగా మహిళను నిలబెట్టి సంచలనం సృష్టించిన వైసీపీ అధినేత జగన్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మధ్యతరగతి గృహిణిగా గూడూరి ఉమాబాల తన పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలో పట్టణాలు, వందలాది గ్రామాలూ లో తన పర్యటన ను పరిపూర్తీ చేస్తున్నారు. ఒకే రోజు 3డేసి నియోజకవర్గాలలో ప్రచారం చెయ్యడం,సీఎం జగన్ సంక్షేమ పధకాలు వివరించడం పలు సంఘాల వారితో సమావేశాలు సమీక్షలు తో రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థులు కూడా మెచ్చుకొనే రీతిలో ప్రశాంతంగా తన ప్రచారం పూర్తీ చేస్తున్నారు. ఆమె కు సీఎం జగన్ ప్యూహంలో భాగంగా ప్రచారం వ్యవధి 2 నెలలు ఉన్న నేపథ్యంలో జనంతో మమేకమై పోయారు. గత శుక్రవారం సాయంత్రం తణుకు పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తో కలిసి ఎన్నికల ప్రచారం విభిన్నంగా నిర్వహించారు. వర్షం వచ్చిన లెక్కచేయ్యలేదు. రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులతో మమేకమయ్యారు.. ఉమాబాల స్వయంగా ఒక బడ్డీ హోటల్లో అట్లు వేసి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. మార్గమధ్యలో ఉన్న రోడ్డు ఫై వ్యాపారం చేస్తున్న వికలాంగుడుతో మాట్లాడి అతడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కారుమూరి కూడా టీ షాప్ లో టీ తయారు చేసి అమ్మారు. ప్రచారం సరదాగా సాగిస్తూ ..ఓటర్లను 2 ఓట్లను ఫ్యాను గుర్తుకు వెయ్యాలని అభ్యర్ధించడం విశేషం..
