సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నంద్యాల లో నేడు, శనివారం ఆసక్తికర ఘటన ప్రకంపనలు సృష్టిస్తుంది. నేడు, శనివారం టీడీపీ అడ్జక్షుడు చంద్రబాబు పర్యటిస్తూ అక్కడ అబ్యర్థి ఓడించాలని బహిరంగ సభలో పిలుపు నిస్తే.. పుష్ప, ..అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి కి భారీ మెజారిటీ ప్రజలు అందివ్వాలని ప్రచారం చేయడంపై చంద్రబాబు బహిరంగ సభలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే రోజు వైసీపీ ఎమ్మెల్యే శిల్ప ఇంటికి ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు వైసీపీ తో పాటు జనసేన పార్టీ జెండాలు పట్టుకుని ప్రదర్శనలు చేస్తూ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. ఏమిటి చీకటి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో గతాన్ని గుర్తు చేసుకొన్నారు. ‘‘నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ 9వ తేదీ గుర్తుకు వస్తోంది. రాత్రి మీటింగ్ కంప్లీట్ చేసుకుని బస చేశాను. నిద్ర పోతున్నప్పుడు పోలీసులు దొంగల్లా వచ్చారు. నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నేను మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని అడిగాను. ఎఫ్ఐఆర్ దారిలో ఇస్తామని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్, మాజీ ముఖ్యమంత్రిని నన్నే అక్రమంగా అరెస్టు చేశారు. ఇక సామాన్యుల ఓ లెక్కా. జైల్లో నన్ను చంపేస్తానంటూ భయపెట్టారు. నన్ను చంపేస్తానంటే ఎవరి మెడకు వాళ్ళు ఉరేసుకుని చావాల్సి వస్తుంది జాగ్రత్త.!. తిరుపతిలో నాపై క్లైమెర్ మెన్స్‌తో దాడి చేస్తే వెంకటేశ్వర స్వామి కాపాడారు’’ అని గుర్తు చేసారు. ఇవాళ సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు. రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాననే విశ్వాసం తనకుందన్నారు సైకో జగన్ మరల ‘‘విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంటా.? ఇడుపులపాయలో మీ నాన్న సమాధి వద్ద చేయ్’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. .జగన్ కి దమ్ము లేదు.. రాయలసీమ ద్రోహి అని విరుచుకుపడ్డారు.‘‘ఈరోజు మరల నేనొస్తే పధకాలు కొనసాగుతాయని జగన్ అంటున్నారు. భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి జగన్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *