సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎండాకాలం కావడంతో పోలింగ్ ప్రారంభమవగానే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వచ్చి క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన తల్లి షాలిని, ఆయన సతీమణి ప్రణతితో కలసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసినవారిని కస్టపడి పనిచేసేవారిని గెలిపించాలని మీడియా లో పిలుపు నిచ్చారు.
