సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేటి ఉదయం 7 గంటలకే పోలింగ్ బూట్ ల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకొంటున్నారు. పోలీసులు ప్రతిష్ఠమైన భద్రతా ఏర్పాట్లను చక్కగా పర్యవేక్షిస్తున్నారు. ఏవో కొన్ని పోలింగ్ బూత్ లు మినహా నియోజకవర్గంలో అన్నిపోలింగ్ బూట్ లలో ఉదయం7 గంటలకే పెద్ద ఎత్తున మహిళలు చేరుకొని తమ ఓటు హక్కు ను వినియోగించుకొంటున్నారు. ఇక పెద్ద మసీదు , గర్ల్స్ హైస్కూల్, గునుపూడి పరిసరప్రాంతాలలో గతానికి బిన్నంగా ముస్లీమ్ సోదరులు, ఏస్సీ ఎస్టీ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ ల వద్ద కు ఉదయం 6 గంటల నుండి భారీ క్యూ లైన్ లలో నిలబడి ఓట్లు వెయ్యడానికి నిరక్షించడం పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. స్వల్పం గా కొన్ని చోట్ల ఓటింగ్ మిషన్స్ మొరాయించిన ఘటనలు జరుగుతున్నాయి. బీమవరం పట్టణం 1వార్డు లో77 నెం బూతు లో ఆలస్యం అవుతున్న చెపుతున్న ఓటర్లు. ఉదయం 7 గం వచ్చినా 9 గం లు అయినా ఇప్పటి వరకూ ఓటరు క్యూ ముందుకు కదలలేదని తెలుస్తుంది.
