సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలలో భాగంగా గత సోమవారం జరిగిన ఏపీలో పోలింగ్ లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో 78.36 శాతం నమోదు కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఫై రికార్డు స్థాయిలో 81.12 శాతం నమోదు కాగా .. జిల్లా లోని 7 నియోజకవర్గాల వారీగా భీమవరం 78.42 శాతం, ఆచంట 82.79 శాతం, నరసాపురం 80.28 శాతం, పాలకొల్లు 83.10 తాడేపల్లిగూడెం 79.81, తణుకు 82.08 ఉండి 82.00 శాతం నమోదు అయ్యింది. ఇందులో కీలక మైన విషయం ఏమిటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలపకుండా ఈ శాతాన్ని నమోదు అయినట్లు గుర్తించాలి. అంటే ప్రతి నియోజకవర్గం మరో 1 శాతం పైగా ఓట్లు పెరిగే అవకాశం ఉంది. కనివిని ఎరుగని ఓట్ల ప్రబంజనంలో భాగంగా భీమవరం మండలం లోని తాడేరు , తుందురు గ్రామాలలో దాదాపు93- 95 శాతం ఓటింగ్? నమోదు అయినట్లు తెలుస్తుంది. కొన్ని బూత్ లలో గత అర్ధ రాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. స్వల్ప ఉద్రిక్తలు మినహా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భీమవరం లో గత రాత్రి ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర మెంటే వారి తోట నుండి బై పాస్ రోడ్డు మీదుగా లేటుగా వచ్చిన ఈవీఎం లు అధికారుల ఆధ్వర్యంలో బస్సు లో కాకుండా కారులో తీసుకోని వచ్చారని వాటి సీలు విషయం ఫై అభ్యన్తరాలు తెలుపుతూ జనసేన నేతలు కొద్దీ సేపు ఆందోళనకు దిగారు. అయితే ఎటువంటి పొరపాటు సీళ్లు సరిగానే ఉన్నాయని జరగలేదని అధికారులు ధ్రువీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *