సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పిఠాపురం లో రికార్డు స్థాయిలో ఏకంగా 85 శాతం ఓటింగ్ జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగటంతో అటు వైసిపి వంగ గీత ఇటు పవన్ కళ్యాణ్ సర్వము ఒడ్డి పోరాటం చెయ్యడం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎవరికీ వారే తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా సోదరుడు నాగబాబు మీడియా సమావేశంలో .. పిఠాపురం ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పోటీ జోరుగా జరిగిందని అయితే మా పవన్ గెలవడం అనేది మనందరికీ ముఖ్యం. మెజారిటీ అనేది తర్వాత విషయం. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదు. మెజార్టీ ఎంతైనా గెలుస్తామని నమ్మకం మాత్రం మాకు ఉంది. మా గెలుపుకి వైసీపీ పాలను కూడా కొంత కారణం’’ అని అన్నారు. పవన్ గెలుపు కోసం పిఠాపురం ప్రజలు ప్రేమతో ఓటు వేశారన్నారు.
