సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతమెంతో ప్రపంచాన్ని ఊపేసిన ఘన కీర్తి .. కేఏ పాల్ .. లక్షలాది మంది తో భారీ మత సభలు నిర్వహించడంలో అతనిని మించిన ఘనుడు ఈ ప్రపంచంలో లేదు.. ప్రపంచ అధినేతలకు మించిన సమ్మోహన శక్తి.. కానీ విధి విపరీతం..ప్రస్తుతం బాధాకరం..ప్రజలు పట్టించుకోరు కానీ ఆయన పచ్చి నిజాలు మాట్లాడతారు. ప్రస్తుతం ప్రజా శాంతి అభ్యర్థిగా విశాఖ ఎంపీగా పోటీలో ఉన్న కేఏ పాల్ తాజాగా నేడు, మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో భారీగా ఓట్లు పోల్ అయ్యాయని…ఎప్పుడూ ఓటు వేయని వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి తానే అడ్డుకున్నాను..ఇది దేవుడి కృపా వల్లేనని అన్నారు .విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అంటే విశాఖలో ఎవరికీ తెలియదని.. బొత్స కుటుంబంపై ఎన్నో అవినీతి, ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు.ప్రత్యర్థులు డబ్బులు పంచినా…తాను ఒక్క పైసా పంచలేదని చెప్పుకొచ్చారు. విశాఖ ప్రజలు మార్పును కోరారని…ఈ సారి ఎన్నికల్లో తాను గెలుస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. తాను పార్లమెంటుకు వెళ్తే.. నరేంద్రమోదీ , రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ అందరినీ కలిపిస్తానని తెలిపారు. జగన్ కానీ చంద్రబాబు,కానీ ఈ ఎన్నికల్లో ఎవరు సీఎం అయినా వారు తనకు శత్రువులు కాదని… వారు తన శిష్యులేనని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వాలు ఎందుకో తనను సరిగా వాడుకోవటం లేదన్నారు.
