సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి ( పవిత్ర కాశీ ) పార్లమెంట్ స్తానం నుండి మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్న ప్రధాని మోడీ నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి నేతలు ఆయనను స్వయంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో ఏపీలో ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేడు, మంగళవారం ప్రధానిని కలసి ఆయన నామినేషన్ కార్యక్రమం లో పాల్గొని శుభాభినందనలు తెలపడం జరిగింది. ఈ సందర్భముగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల స్థానాలు రావడం గ్యారెంటీ అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారనే ధీమా వ్యక్తం చేశారు..వారణాసి పవిత్రస్థలం.. మోడీ నామినేషన్ ఓ చారిత్రక ఘట్టమని అన్నారు. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఆ లక్ష్యం వైపు సాగడంలో తమ వంతు మద్దతు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
