సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న ఓటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన ఇద్దరు ఓటర్ల కుటంబాలలో తీవ్ర విషాదం జరిగింది.గత సోమవారం భీమవరం మండలం డేగాపురం గ్రామం లోని 83వ నంబర్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆశీర్వాదం అనే ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు, తెలిపిన వివరాల ప్రకారం అతను గత కొద్దినెలల క్రితం గుండెకు ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకొంటున్నాడు. అయితే ఎన్నికలలో ఓటింగ్ కు క్యూ లైన్లో 2 గంటలు నిలబడటం ఎండవేడిమి కి అలసటకు గురయి అక్కడికక్కడేస్పృహ తప్పి పడిపోయాడు. వెంటనేబంధువులు భీమవరంలోని ఆస్పత్రికితరలించగా వైద్యులు పరీక్షించి ఆశీర్వాదం మృతి చెందినట్లు నిర్ధారించారు. మరో ఘటన పాలకొల్లు లో జరిగింది. చింతపర్రు గ్రామంలో తానేటినాగమణి (68) అనే వృద్దురాలు ఓటు వేసేందుకు తన కుమారుడిమోటార్సైకిల్పైపోలింగ్ కేంద్రానికిచేరుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమెమోటార్సైకిల్పైఇంటికివెళుతూ ప్రమా ప్ర దవశాత్తూ జారిపడిపోయారు. దీంతో ఆమెను ఇంటికితీసుకువెళ్లి చికిత్స అందించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు. నాగమణికిముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త చాలా రోజుల క్రితమేచనిపోయారు. ఆమెవృద్ధాప్య పింఛనుప్రతిప్ర నెలా అందుకుంటున్నారు. విధి విచిరం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *