సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వైపు దేశం యావత్తు చూసింది. ఒక్క నేత ను లక్ష్యంగా చేసుకొని బీజేపీ , కాంగ్రెస్, టీడీపీ జనసేన, కమ్యూనిస్టులు జగన్ కుటుంబ సభ్యులు సైతం కలసి పని చెయ్యడం, ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ సైతం ఇక్కడ ప్రచారం చెయ్యడం వారిని చూసి ఏమాత్రం తగ్గేదే లే.. అన్న బాహుబలి రీతిలో సీఎం జగన్ ఎన్నికల బరిలోకి దిగడం దేశ రాజకీయాలలో ఆసక్తి కర చర్చ నడిచింది. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన పోలింగ్ దృష్ట్యా ముఖ్యముగా గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలు వృద్దులు , మైనారిటీలు, పోలింగ్ బూత్ ఓట్లు వెయ్యడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు తమదేనని వైసీపీ నేతలలో ధీమా వ్యక్తం అవుతుంది. ఇదే తీరున వైసీపీ అభిమానుల జోష్ ను మరింత పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ తాజా గా ట్విట్ విడుదల చేసారు.. దానిలో.. నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.అన్నారు.
