సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిజం నిష్ఠురమైన.. ఇటీవల అందరి ద్రుష్టి పాన్ ఇండియా సినిమాల మీదే.. అగ్రహీరోలు సినిమా పూర్తీ చెయ్యడానికి బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ ఉన్న సరే.. అవలీలగా 2 లేదా 4 ఏళ్ళు పడుతుంది. ఇక చిన్న స్థాయి హీరోల సినిమా వచ్చిందంటే యూత్ మినహా సినిమా థియేటర్స్ కు అది కూడా మల్టి ఫ్లెక్స్ థియేటర్స్ మినహా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు రావడం లేదు. పెద్ద హీరోల సినిమాలు మొదటి 3 రోజులు ఆడుకోవడానికి తప్ప సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎందుకు పనికిరావడం లేదు. దీనితో తెలుగు సినిమా పరిశ్రమ సంక్షోభంలో పడింది. ప్రదర్శనకు సరైన సినిమా లేక, ప్రేక్షకులు థియేటర్స్ కి రాకపోవటం వలన, నిర్వహణ ఖర్చులు తట్టుకోలేక తెలంగాణా రాష్ట్రంలో సుమారు 450కి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని రోజులపాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఏమీ బాగోలేదు. ప్రేక్షకులు సినిమా థియేటర్స్‌కి రావటం మానేశారు, అలాగే సరైన సినిమాలు కూడా రావటం లేదు. దీనికి ప్రధాన కారణం పెద్ద హీరోల కోట్ల రూపాయల రెమ్యూనేషన్ యావ మాత్రమే ప్రధాన కారణం. అగ్ర హీరోలే గతంలో సూపర్ స్టార్ కృష్ణ మాదిరిగా అలోచించి ఏడాదికి కనీసం 4 సినిమాలయిన నటిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కళకళ లాడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *