సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు వారాంతం రోజు నేడు, శుక్రవారం కూడా (మే 17న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73917 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22466 పాయింట్ల వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు వృద్ది చెంది 48,116 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 452 పాయింట్లు పెరిగి 51,605 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు అమెరికా స్టాక్‌లు బాగా పుంజుకోవడంతో ఈ వారంతంలో బుల్ స్టాక్ బెట్టింగ్‌లలో ప్రభావం కనిపించింది. ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్లో ఆటో, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో గరిష్ట బలం నమోదైంది. ఈ క్రమంలో ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్‌లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉండగా, సిప్లా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎస్బీఐ లైఫ్, హెచ్‌సీఎల్, బ్రిటానియా నిఫ్టీ నష్టాల బాట పట్టాయి.
