సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక డి యన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా . యం.అంజాన్ కుమార్ నేడు, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..తమ కళాశాలలో ఈఏపీసెట్-2024 పరీక్ష కేంద్రలో జరుగుతున్నా అగ్రి కల్చరల్,ఫార్మసి మరియు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సుమారు 2 వేలమంది హాజరు అవుతున్నారని, ఇందులో భాగంగా ఈఏపీసెట్ -2024 మొదటి రోజుకు గాను ౩౦౦ మంది కి 267 మంది హాజరయ్యారని తెలిపారు రెండొవ రోజుగాను ఉదయం 150 మందికి గాను 140 మంది హాజరయ్యారని .మరియు మధ్యాహ్నం 150 మందికి గాను 134 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షవ్రాయటకు ఇతర జిల్లాలు నుండి వచ్చిన తల్లిదండ్రులుకు ,వేసవికాలం దృష్ట్యా తల్లిదండ్రులు వేచి ఉండుటకు ప్రతేక్య గదులను ఎర్పాటుచేశామని, ప్రతేక్య సిబ్బందితో విద్యార్థులకు ఎలాంటి ఆసౌకర్యాలు లేకుండా ప్రశాంత వాతావరణంలోపరీక్షలు నిర్వహిస్తున్నామని కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబు స్వయంగా తల్లిదండ్రులు వద్దకు వెళ్లి సౌకర్యాలు గురించి అడిగి తెలిసుకున్నారు అని తెలిపారు. NAAC -A ++ ,NBA గ్రేడు లు సాధించిన తమ కళాశాలలో గత 5 సంవత్సరాలుగా తమ కళాశాలలో టి .సి .యస్ వారిచే అనేక ప్రవేశిక పరీక్షలు , ఈసెట్,ఈఏపీసెట్లను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రములో అసిస్టెంట్ సెక్రటరీ, కే శివరామరాజు పాల్గున్నారు
