సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని కాళ్ళ మండలం లో స్వయం భువుడు,కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నా శ్రీవారి కళ్యాణోత్సవాలు చివరి అంకంలోకి వచ్చాయి.ఆలయం పుష్ప అలంకరణలతో విద్యుతు దీప అలంకారణాలతో శోభాయమానంగా వెలిగిపోతుంది. ఈ నేపథ్యంలో నేడు, శనివారం విశేషంగా భక్తులు దేవేరులతో శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు, నేటి సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవాలలో భాగంగా సహస్ర దీప అలంకరణ సేవ చేసి శ్రీవారిని దేవేరులతో ఉయ్యాలలో ఊపుతూ భక్తి కీర్తనలతో ఉల్లాసపరిచారు భక్తులు..రాత్రి శ్రీవారికి ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు. పుష్పోత్సవం నిర్వహించి తదుపరి పవళింపు సేవ కు శ్రీవారిని ఉపక్రమింప చేసారు. కల్యాణోత్సవాలు ముగింపుగా వచ్చే జూన్ 1వ తేదీ న స్వామివారి తోట లో అఖండ అన్న సమారాధన నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *