సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం బంగారం ధరల పెరుగుదల చుస్తే 10గ్రాముల ధర రూ.80వేలు కు, వెండి కేజీ కి 1 లక్ష రూ. దాటుతుందనుకున్న సమయంలో అకస్మాతుగా తగ్గుముఖం పట్టడం జరిగింది. అంతర్జాతీయ విపణి ప్రభావంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు కాస్త స్థిరంగానే కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400ఉండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది. .ఇక ఢిల్లీలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 66,550కాగా, 24క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.72,590గా ఉంది. ఊహించని విధంగా దూసుకెళ్లిన కిలో వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ముంబయి, దిల్లీ, పుణె నగరాల్లో కిలో వెండి ధర రూ.91,500గా ఉండగా.. చెన్నై, హైదారబాద్, విజయవాడ, విశాఖపట్నం, కేరళలలో రూ.96,000గా కొనసాగుతుంది
