సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,ఆదివారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారిన ‘రీమల్’ తుపాను అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి సగటున 5.8కి.మీ వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.నరసాపురం, భీమవరం సముద్ర తీరా ప్రాంతాలలో మత్యకారులు మరో 2 రోజులు పాటు వేటకు వెళ్లోద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. కాగా.. గడచిన మూడు రోజులుగా వాయువ్య భారతంలో తీవ్ర ఎండ వేడిమితో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాలో మేఘాలు కమ్ముకొంటున్న తీవ్ర ఆవిరితో కూడిన ఉక్కపోత తో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. ఏసీలు వినియోగించని వారికీ నరకం కనపడుతుంది.
