సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చము అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ( రేవంత్ సీఎం అయ్యాక ఇదే బాలయ్య ఆయనను తొలిసారి కలవడం) ఈ సందర్భముగా బాలయ్య మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశానని , రాజకీయ చర్చలు ఏమి లేవని, పాత పరిచయాలు వల్ల పల్లకరింపులు తదుపరి,హైదరాబాద్ లోని తన నేతృత్వంలోని బసవ తారకం కాన్సర్ హాస్పటల్ నిర్వహణకు సంబందించి మాట్లాడుకొన్నామని, కాన్సర్ రోగుల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో వలె బసవ తారకం హాస్పటల్ కు సంపూర్ణ సహకారం అందిస్తుందని రేవంత్ అన్నారని తెలిపారు.
