సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని నేడు, ఆదివారం మీడియా సమావేశంలో ఎన్నికల కమిషన్ తీరుపై సంచలన వ్యాక్యలు చేసారు. కూటమిలో బీజేపీ ఉండటం తో రాష్ట్రంలో కూటమి నేతలు కోరిన అధికారులనే నియమిస్తున్నారు..అక్కడే హింస చెలరేగింది. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదు.. అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.. అంటూ పేర్నినాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్పీ సహా అధికారులకు తమ ప్రాంతంలో టీడీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారని ,పిన్నెల్లి ఫిర్యాదు చేశారని,అయిన పట్టించుకోలేదని మాచెర్ల లో పాటు రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ వారు దాడులు చేసినా, వైసీపీ నేతలపై హత్యాయత్నం పోలీసులు పట్టించుకోలేదంటూ, కేసులు పెట్టలేదని దానికిసంబందించిన.. వైసీపీ సానుభూతిపరుల నివాసాలు, షాపులపై.. టీడీపీ నేతలు దాడులు చేసిన వీడియోలను మీడియాకు పేర్ని నాని విడుదల చేసారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే.. 13వ తేదీనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు.?. అక్కడ ఈవీఎం లో పోలింగ్ ఎందుకు రద్దు చెయ్యలేదు?అంటే అక్కడ టీడీపీ వేసుకొన్న రిగ్గింగ్ ఓట్లు పోతాయనే కదా? డీజీపీకి సిట్‌ ఇచ్చిన నివేదికలో..పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు..పిన్నెల్లిని హత్యచేయాలని టీడీపీ యత్నిస్తోందని.. టీడీపీ కుట్రలకు పోలీసుల సహకారం ఉందంటూ..ఆ ఆలోచనతోనే.. ఎమ్మెల్యే ఇంటిదగ్గర బలగాలను తొలగించారంటూ పేర్ని నాని పేర్కొన్నారు. టీడీపీ నేతలతో కలిసి ఎస్సై నారాయణస్వామి కుట్రలు చేశారని.. అన్ని ఆధారాలతో చెబుతున్నామన్నారు. డీజీపీ విచారణ జరిపించాలంటూ పేర్ని నాని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *