సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి ఎండలు ఉక్కపోతలు పెరిగినట్లే.. గత కొన్ని రోజులగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో, చికెన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. కిలో చికెన్ ధర ‘300 రూ .’ సెంచరీ దాటింది. గుడ్డు ధరా అంతకంతకూ ‘ఎగ్’ బాకుతోంది. వారం క్రితం 150 ఉండే 30 గ్రుడ్డులు ఉండే అట్ట 170- 180 కి చేరుకొంటుంది. మొన్నటి వరకూ ఎండల మంట ఇప్పుడు చికెన్ ధరలపై పడింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300 పలుకుతోంది.స్కిన్‌లెస్‌ చికెన్ అయితే కిలో రూ.320 వరకూ విక్రయిస్తున్నారు. మండుటెండలకు బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దాణా తీసుకోకపోవడం వంటి కారణాలతో కోళ్ల బరువు పెరగలేదు. గుడ్డు సైజు పెరగటం లేదు.. అని ఫౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. వేసవిలో నీటి కొరత, తీవ్రమైన వేడి కారణంగా పౌల్ట్రీ ఫామ్‌లలో ఉన్న కోళ్లు మృత్యువాత పడుతున్నాయని.. దీంతో కోళ్ల పెంపకం చాలా కష్టమైపోయిందని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. ఇటీవల అదనంగా పెరిగిన రవాణా ఖర్చులు కూడా ధరల పెరుగుదలకు కారణంగా పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *